రామలక్ష్మితో నాకు పోలికేంటి.? : సమంత

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 01:54 PM

రామలక్ష్మితో నాకు పోలికేంటి.? : సమంత

హైదరాబాద్, ఏప్రిల్ 19 : గాలి పల్లకిలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే...
రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు మాత్రమే కాదు ఆ సినిమా చూసిన ప్రతీ తెలుగు ప్రేక్షకుడు సినీ నటి 'సమంత' గురించి ఇలా పాడుకున్నాడంటే అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టేసింది సమంత. రామలక్ష్మి పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయింది. రంగస్థలం సినిమా ముందు వరకు "సమంత అంటే 'ఏ మాయ చేసావే' చిత్రంలో 'జెస్సీ' పాత్ర గుర్తొచ్చేది. ఇక నుంచి 'రంగస్థలం'లోని రామలక్ష్మిగా గుర్తుండిపోతుంది" అంటున్నారు సమంత అభిమానులు.

అయితే ఈ విషయాన్ని సమంతను అడిగితే.. 'నా సినీ కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి పాత్ర దొరకదేమో అనిపిస్తోంది. రంగస్థలం సినిమాలో అంత గొప్ప పాత్ర చేశాను. నిజజీవితంలో అలా ఉండను. నిజం చెప్పాలంటే ఈ పాత్రకూ, నాకూ ఎలాంటి పోలికా ఉండదు' అని ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది.





Untitled Document
Advertisements