హ్యాకింగ్ కు గురైన సుప్రీంకోర్టు వెబ్‌సైట్..!

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 02:05 PM

హ్యాకింగ్ కు గురైన సుప్రీంకోర్టు వెబ్‌సైట్..!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : భారత సుప్రీం కోర్టు అధికారక వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. supremecourtofindia.nic.in పేరిట ఉన్న వెబ్‌సైట్‌ ప్రస్తుతం ఓపెన్ అవ్వడంలేదు. మళ్లీ పునరుద్ధరించేందుకు అధికారులు ఈ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా ఆపినట్లు సమాచారం. హైటెక్ బ్రెజిల్ హ్యాక్ టీమ్‌గా చెప్పుకుంటున్న సైబర్ దొంగల ముఠా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను చెరబట్టేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవలే భారత రక్షణ శాఖ, హోమ్, న్యాయశాఖలకు చెందిన అధికారిక వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికాగా.. నెలరోజులు గడువక ముందే సుప్రీంకోర్టు వెబ్‌సైట్ కూడా హ్యాకింగ్‌కు గురికావడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





Untitled Document
Advertisements