'దాసరి' ఉంటే ఇలా జరిగేది కాదా...?

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 02:34 PM

'దాసరి' ఉంటే ఇలా జరిగేది కాదా...?

హైదరాబాద్, ఏప్రిల్ 19 : ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే 'ఒక మొక్క చెట్టుగా ఎదగటానికి కొన్ని సంవత్సరాలు కావాలి. అదే ఒక చెట్టును కూల్చేయటానికి కొన్ని గంటలు చాలు' అనే మాట గుర్తొస్తోంది. నిజానిజాలు పక్కన పెట్టి ఆలోచిస్తే, ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న పేరు, హోదా కొన్ని ఆరోపణలతో మంటగలిసిపోతోంది. ఈ విషయంలో సినీ పెద్దలు ఎంతో ఆందోళన చెందుతున్నారు.

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తాలూక ఉద్దేశం మంచిదే అయినా.. ఉద్యమం చేసే విధానం సరిగా లేనందు వల్లే ఇలా మిస్ ఫైర్ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి జీవితా రాజశేఖర్, నాగబాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు మరి కొంతమంది మీడియా సమావేశాలు పెట్టి స్పందించారు. మొన్న సినీ నటి జీవిత మాట్లాడుతూ.. 'దాసరి నారాయణరావు ఉంటే ఇలాంటి సంఘటనలు, నిరాధారిత ఆరోపణలు జరిగేవి కాదు. మేము దాసరిని చాలా మిస్ అవుతున్నాం' అన్నారు. అకారణంగా తెలుగు సినిమా పరిశ్రమపై బురద జల్లుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు వాపోతున్నాయి.





Untitled Document
Advertisements