బుల్లి "రామలక్ష్మి" కి సమ౦త ఫిదా..!!

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 04:18 PM

బుల్లి

హైదరాబాద్, ఏప్రిల్ 19 : పల్లెటూరి పడచుగా రామలక్ష్మి పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది అక్కినేని సమ౦త. "రంగస్థలం" చిత్రంలో ఆమె పలికించిన హావాభావాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. సమ౦త కు ఎంత పేరొచ్చిందో.. 'రంగమ్మ మంగమ్మ' పాటకు కూడా అంతే పేరొచ్చింది అని చెప్పవచ్చు. తాజాగా సమ౦త కు పోటీగా బుల్లి రామలక్ష్మి వచ్చింది. 'రంగమ్మ మంగమ్మ' పాట‌కు డ్యాన్స్ వేసి స‌మంత‌నే ఫిదా చేసింది ఓ చిన్నారి. చక్కగా లంగాఓణీ వేసుకుని అచ్చం స‌మంత‌లాగానే హావ‌భావాల‌తో అద‌రగొట్టింది.

ఓ అభిమాని ఈ వీడియోను సమంతకు ట్వీట్‌ చేస్తూ.."రామలక్ష్మి పాత్ర మాకే కాదు ఎన్నో హృదయాల్లో నిలిచిపోతుంది అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ" అని పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో చిన్నారి నాట్యాన్ని చూసిన స‌మంత ఫిదా అయిపోయి.. 'చ‌చ్చిపోతున్నా' అంటూ కామెంట్ చేసి హార్ట్ సింబ‌ల్స్ పోస్ట్ చేసింది. అంతేకాకుండా అన‌సూయ కూడా స్పందిస్తూ.. 'నేను కూడా. ఇంత క్యూట్‌గా ఉండ‌డం నేరం' అంటూ కామెంట్ చేసింది.





Untitled Document
Advertisements