జైపూర్,ఏప్రిల్ 19 : టీమిండియా క్రికెట్ లో ప్రస్తుతం ధోని పేరు అందరికి సుపరిచితమే. అతని ఆలోచనలు, ప్రశాంతతా కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. ఇంకా మహి కీపింగ్ చేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు అదే తరహాలో దినేష్ కార్తీక్ చేసిన ఔట్ ఒకటి ధోనిని తలపిస్తుంది. తాజాగా ఐపీఎల్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రాజస్థాన్ రాయల్స్ సారథి రహానెను ఔట్ చేసిన విధానం చూస్తే ధోనీ కూడా ఆశ్చర్యపోతాడేమో అంటున్నారు క్రికెట్ అభిమానులు.
ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. రహానె-షార్ట్ రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 7వ ఓవర్లో నితీష్ రాణా వేసిన ఐదో బంతిని ఎదుర్కొనేందుకు రహానె క్రీజు దాటి బయటకు వచ్చాడు. కానీ, ఆ బంతి రహానె కాలును తాకి పక్కనే పడింది. వెంటనే దినేశ్ కార్తీక్ బంతిని అందుకుని గురి చూసి వికెట్లకు విసిరాడు. అప్పటికి రహానె (36) క్రీజులోకి రాకపోవడంతో ఔట్‌గా పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
It's all OK when it's DK https://t.co/RXD9vDBawe
— Ashish Rana (@ARthegreat1) April 19, 2018