'లిక్కర్ కింగ్' ను తిరిగి రప్పించేందుకు ప్రధాని మంతనాలు..!

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 06:30 PM

'లిక్కర్ కింగ్' ను తిరిగి రప్పించేందుకు ప్రధాని మంతనాలు..!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు 'లిక్కర్ కింగ్' విజయ్ మాల్యా. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాన మంత్రి థెరేసా మేతో చర్చల సందర్భంగా విజయ్ మాల్యా గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన వివాదాల్లో ఇరు దేశాలు సహకరించుకోవడంపై వీరిద్దరూ చర్చించినట్లు బ్రిటన్ పీఎం అధికార ప్రతినిథి ఒకరు చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

విజయ్ మాల్యా మనీలాండరింగ్ చేసినట్లు, బ్యాంకులను మోసగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయనను భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2017లో ఆయనను లండన్ పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. అయితే వెంట వెంటనే మాల్యా బెయిలు పై బయటకు వచ్చారు.

Untitled Document
Advertisements