మేకప్‌మెన్‌ కు కారు బహుకరించిన జాక్వెలిన్‌..

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 06:56 PM

మేకప్‌మెన్‌ కు కారు బహుకరించిన జాక్వెలిన్‌..

హైదరాబాద్, ఏప్రిల్ 19 : బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. తన మేకప్‌మెన్‌ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా షాన్‌ ముత్తాతిల్‌ అనే వ్యక్తి జాక్వెలిన్‌ దగ్గర మేకప్‌మెన్‌ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల షాన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తనకు కారును బహుమతిగా ఇచ్చారు.

ఈ విషయాన్ని షాన్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆన౦దాన్ని వ్యక్తం చేశారు. "జాక్వెలిన్‌ మీరు నిజంగా నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. నన్ను మేరు కారు దగ్గర వీడియో తీయమన్నప్పుడు ఆ కారు నాకే అని అస్సలు ఊహించలేకపోయా" అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం జాక్వెలిన్‌ సల్మాన్‌ సరసన "రేస్‌ 3" చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements