సింపుల్ బ్యూటీ ప్యాక్స్ మీకోసం..

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 04:37 PM

సింపుల్ బ్యూటీ ప్యాక్స్ మీకోసం..

హైదరాబాద్, ఏప్రిల్ 20 : ముఖం పైనా, చర్మానికి సంబంధించి చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖం మీద అప్పుడప్పుడు ట్యాన్ ఏర్పడుతుంది. శరీరం కమిలినట్లుగా కనిపిస్తుంది. రెండు స్పూన్లు పెరుగు , కొంచెం తేనె కలిపి మసాజ్ చేస్తుంటే ట్యాన్ పోతుంది.ఒత్తుగా ఉండే కనుబొమ్మలు ముఖానికి ఎంతో అందాన్నిస్తాయి. ఆముదం, ఆలివ్ నూనె సమపాళ్ళలో కలిపి ప్రతి రోజు రాస్తుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

మరికొన్ని చిట్కాలు...

>> యాపిల్ ముక్కలను గ్రైండ్ చేసి , దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, తాజా మీగడ కలిపి రాస్తుంటే ముడతలు పడవు. మజ్జిగ, బంగాళదుంప రసం, సమపాళ్ళలో కలిపి ముఖానికి రాసుకుంటుంటే పసిపాప చర్మంలా మృదువుగా మెరిసిపోతుంది.

>> కళ్ళ చుట్టూ ముడతలు, గీతలు పడుతుంటే ఒక స్పూన్ బొప్పాయి గుజ్జులో మీగడ, ఆలివ్ ఆయిల్ కలిపి రాసి కొద్దిసేపు వదిలేయాలి.

>> ఓ గుప్పెడు మెంతిపిండి, గోరింటాకు పొడిలో తగినంత కొబ్బరి నూనె, ఆముదం కలిపి మాడుకు పట్టిస్తే జుట్టు నిగనిగమని మెరుపులీనుతు పెరుగుతుంది. ఇలా చిన్న చిన్నవి పాటించడం వల్ల మెరిసి అందం మీ సొంతమవుతుంది.





Untitled Document
Advertisements