కృష్ణానగర్‌ లో బాంబు పేలుడు

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 06:53 PM

కృష్ణానగర్‌ లో బాంబు పేలుడు

హైదరాబాదు, ఏప్రిల్ 20: నగరంలో స్మోక్ బాంబు పేలుడు కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే యూసఫ్ గూడలోని కృష్ణానగర్‌ బి బ్లాక్ లోని మొదటి అంతస్తులో సిలిండర్ల సాయంతో అశోక్ అనే యువకుడు స్మోక్ బాంబులు తయారు చేస్తుండగా, పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అశోక్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

కాగా, సినిమా షూటింగ్స్ కోసం అశోక్ ఈ బాంబులు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నింబంధనలు ఉల్లంఘించి ఈ స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements