"కాలా" రిలీజ్ డేట్ ఫిక్స్..

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 12:08 PM


హైదరాబాద్, ఏప్రిల్ 21 : సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా.. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "కాలా". ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా విడుదలకు మాత్రం నోచుకోలేదు. తమిళ చిత్ర పరిశ్రమ బంద్ కారణంగా ఇప్పటివరకు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 7 వ తేదీన విడుదల చేస్తున్నారు. ధనుష్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, వండర్‌బార్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కథానాయకుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురికివాడల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో రజనీకాంత్ 'కరికాలన్' అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements