ప్రారంభమైన సినీ అత్యవసర సమావేశ౦..

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 12:43 PM

ప్రారంభమైన సినీ అత్యవసర సమావేశ౦..

హైదరాబాద్, ఏప్రిల్ 21 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన తల్లిని దూషించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న ఫిలింఛా౦బర్ లో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు నిర్ణయించారు.

ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న సంఘటనలు, లైంగిక వేధి౦పులు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి సినీ పరిశ్రమలో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, తెలంగాణ మంత్రులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సైతం హాజరవుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. పవన్ వరుస ట్వీట్లు చేస్తూ.. నిజాలను నిగ్గు తేల్చుకుందాం అంటూ చేస్తున్న పోస్టుల నేపథ్యంలో ఇంతకు పవన్ ఏం చెబుతారో.. పవన్ భవిష్యత్ కార్యాచరణ ఏంటో అనే దానిపై అభిమానులలో ఉత్కంఠ నెలకొంది.





Untitled Document
Advertisements