బాలకృష్ణపై భాజపా ఆగ్రహం..

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 12:52 PM

బాలకృష్ణపై  భాజపా ఆగ్రహం..

నెల్లూరు, ఏప్రిల్ 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ ప్రధాని మోదీని కించపరిచిన బాలయ్యను వెంటనే అరెస్టు చేయాలంటూ ఏపీ అంతటా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

అలాగే ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Untitled Document
Advertisements