అన్నం అసహ్యం పుడుతుందా..? ఇలా తగ్గించుకోండి!

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 03:59 PM

అన్నం అసహ్యం పుడుతుందా..? ఇలా తగ్గించుకోండి!

హైదరాబాద్, ఏప్రిల్ 21 : నోటికి రుచి తెలియకపోవడం, అన్నం తినాలని అనిపించకపోవడం, ఆకలి వేస్తోందిగాని నోట్లోకి ఏది వెళ్లకపోవడం ఇలాంటి లక్షణాలు తరచూ చాలా మందిలో కన్పిస్తుంటాయి."అరాచకం" అనే వ్యాధిగా చెప్తారు. అన్నం తినాలనిపించక పోవడమే ఈ వ్యాధి లక్షణం. ఆ వ్యాధి వస్తే మనిషి చిక్కిశాల్యమైపోతారు. అన్నాన్ని చూస్తే ఏదో పురుగుల్ని చూసినట్లనిపిస్తుంది. తిండి తినడాన్ని ద్వేషిస్తారు. వీళ్ళు ఒక్కోదశలో ఇది చాలా సీరియస్ గా తీసుకోవలసిన విషయంగా మారిపోతుంది కూడా!

*ఇలాంటప్పుడు 'వాయువిడంగాలు'చాలా బాగా పనిచేస్తాయి. పచారీ కొట్లలో అవి చాలా తేలికగా దొరికేవే. వాయువింగడాలను నేతిలో వేయించి మెత్తగా నూరి, దానికి నాలుగురేట్లు తెనేకలిపి, ఈ తేనే మిశ్రమాన్ని నోటినిండా పోసుకొని పది పదిహేను నిమిషాలసేపు బాగా పుక్కిలించి వదిలేయండి. రోజూ ఇలా చేస్తే ఆరోచకం వ్యాధిపోతుంది .

*నల్లజీలకర్ర, జీలకర్ర, మిరియాలు, ద్రాక్ష, చింతపండు, దానిమ్మగింజలు, ఉప్పు, బెల్లం, తేనే -ఇవన్నీ సమానంగా తీసుకోండి. అన్నింటిని విడివిడిగా మెత్తగా దంచి అన్నీ కలిపేసి మెత్తగా నూరండి ముద్దలుగా వస్తుంది. దాన్ని రేగు గింజింత మాత్రలు చేసుకోండి ! ఒక్కోమాత్రని బుగ్గన పెట్టుకొని రసం మింగుతుంటే అన్నం సహించని జబ్బు తగ్గిపోతుంది.

* వెలగుపండుని మంటమీద కాల్చి, లోపల గుజ్జు తీసుకోండి. దానికి సమానంగా శోంఠీ, పిప్పళ్ళు, మిరియాలు, ఈ మూడింటి పొడినీ కలపండి ఈ మొత్తానికి సమానంగా పంచదార వేసి, నూరి మాత్రలు చేసుకొని చప్పరిస్తూ వుంటే ఈ జబ్బు త్వరగా తగ్గిపోతుంది.

* అల్లాన్ని బాగా సన్నగా ముక్కలుగా తరిగి నేతిలో వేయించండి. సైంధవలవణం, మిరియాలు, నల్లజీలకర్ర, జీలకర్ర వీటిని విడివిడిగా మెత్తగా దంచి, ఆ పొడిని నేతిలో వేగుతున్న అల్లంముక్కలమీద వేయండి.

* ఇంగువని విడిగా మెత్తగా దంచి, దాన్ని నేతిలో వేయించి, ఆ నేతిలో అల్లం ముక్కల్ని వేయిస్తే మరీ మంచిది. ఇలా తయారుచేసుకొన్న అల్లాన్ని అన్నంలో మొదటి ముద్దగా తినండి. అన్నహితువు కలుగుతుంది. నోటికి రుచి కలుగుతుంది. కడుపులో దోషాలు కడిగేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి కలుగుతుంది.

* ధనియాలు, జీలకర్ర -ఈ రెండింటిని మెత్తగా దంచి, దానికి నాలుగురెట్లు ఆవునెయ్యిని, ఆవునేయ్యికి నాలుగురెట్లు మంచినీళ్ళు కలిపి పొయ్యిమీద పెట్టి ఉడికించండి. కలిపిన నీళ్ళన్నీ ఆవిరైపోయి.. కేవలం నెయ్యి మాత్రం మిగులుతుంది. ఈ నేతిని ఒక చెంచా మోతాదులో తాగండి. లేదా అన్నంలో వేసుకొని తినండి. అన్నహితువు కలుగుతుంది. ఆకలి పెరుగుతుంది. కడుపులో మంట, పైత్యం పోతాయి. వాంతి తగ్గిపోతుంది.





Untitled Document
Advertisements