పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జర్నలిస్టులు

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 04:41 PM

పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జర్నలిస్టులు

విజయవాడ, ఏప్రిల్ 21: కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు నేతలు, 24 గంటల్లో పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం తగదని, పవన్ వ్యాఖ్యలతో జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయని సంఘాల నేత చలపతిరావు వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. మీడియా మొత్తానికి ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పవన్ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి.

Untitled Document
Advertisements