అభిమానులను ఎవరు ప్రేరేపిస్తున్నారు : పవన్

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 06:53 PM

అభిమానులను ఎవరు ప్రేరేపిస్తున్నారు : పవన్

హైదరాబాద్, ఏప్రిల్ 21 : సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల రిత్యా జనసేన పార్టీ కార్యాలయానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. తనపై చేస్తున్న దుష్ప్రచారంపై న్యాయంగా పోరాటం చేస్తానని, అభిమానులు సంయమనం పాటించండ౦టూ పేర్కొన్నారు.

తనను నిగ్రహంతో ఉండమని పలువురు అంటున్న నేపథ్యంలో.. "నా తల్లిని తిట్టినా చిన్నపాటి కోపం కూడా రాకూడదా.? నా తల్లిని ప్రస్తావిస్తూ ఎంత దుర్భాషలాడినా, ఎంతగా ప్రసారం చేసినా పట్టించుకోకుండా ఉండాలా? నా అభిమానులను ఎవరు ప్రేరేపిస్తున్నారు..? మీరా.? నేనా.? తప్పకుండా అందరిపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.

Untitled Document
Advertisements