బార్డర్ లో భారీ కూంబింగ్

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 11:51 AM

బార్డర్ లో భారీ కూంబింగ్

భద్రాద్రి, ఏప్రిల్ 22 : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. దండకారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ సాగిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ పార్టీ, కోబ్రా, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్‌ బలగాలు కలిసి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి.

మావోల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాదికారులు పలుమార్లు సమావేశమయ్యారు. మావోయిస్టులపై పట్టు సాధించే దిశగా జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. దీంతో సరిహద్దులోని ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.Untitled Document
Advertisements