బౌల్ట్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్..

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 12:09 PM

బౌల్ట్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్..

బెంగళూరు, ఏప్రిల్ 22 : ఐపీఎల్ అంటేనే.. ఎన్నో రికార్డులు.. అదిరిపోయే బౌండరీలు.. కళ్ళు చెదిరే క్యాచ్ లు.. ఇలా ఎన్నో ఘటనల సముహారం.. ప్రస్తుతం ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్‌ పట్టిన క్యాచ్‌ హాట్‌ టాపిక్ గా మారింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, దిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 174 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన ఆర్‌సీబీ ఐదు ఓవర్లలోపే ఓపెనర్లు వోహ్రా (2), డికాక్‌ (18)వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో సారథి కోహ్లీ (30,) విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సహాయంతో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో‌ 11ఓవర్‌లో తిరిగి బంతి అందుకొన్న హర్షల్‌ పటేల్‌ చివరి బంతిని ఫుల్‌టాస్‌గా విసిరాడు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లీ దానికి ఓవర్‌ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా కొట్టాడు. కానీ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ట్రెంట్‌ బౌల్ట్‌ దానిని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు ఈ ఫీట్ కు కు వాట్ ఏ క్యాచ్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.





Untitled Document
Advertisements