మహేష్ షేర్ చేసిన ఫోటో చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!!

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 12:33 PM

మహేష్ షేర్ చేసిన ఫోటో చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!!

హైదరాబాద్, ఏప్రిల్ 22 : సూపర్ స్టార్ మహేష్ బాబు తరచూ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన "భరత్ అనే నేను" చిత్ర విజయాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు. చిత్రం విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా మహేష్ పోస్ట్ చేసిన అరుదైన ఫోటోను చూస్తే అభిమానులు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇదివరకెన్నడు ప్రిన్స్ ఇలాంటి ఫోటోలను షేర్ చేయలేదు.

తన భార్య నమ్రతకు ముద్దుపెడుతున్న పిక్‌ను మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి 'థాంక్యూ మై లవ్‌' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టి౦ట్లో తెగ వైరల్ అవుతోంది. బహుశా "భరత్ అనే నేను" చిత్రాన్ని తన భార్య నమ్రతకు అంకితమిస్తూ ఈ ఫోటో షేర్ చేసినట్లున్నాడు అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కథానాయికగా కైరా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Untitled Document
Advertisements