పట్టపగలు రౌడీషీటర్‌ దారుణహత్య

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 12:50 PM

పట్టపగలు రౌడీషీటర్‌ దారుణహత్య

హైదరాబాద్, ఏప్రిల్ 22‌: సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్‌ దగ్గర రౌడీషీటర్‌ ఫరీద్‌ పట్టపగలే దారుణహత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ ఫరీద్‌పై ముందుగా కల్లలో కారం చల్లిన దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన ఫరీద్‌పై చిలకలగూడ పోలీస్‌స్టేషన్లో పలు కేసులతో పాటు రౌడీషీట్‌ తెరిచి ఉంది. ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు అతడిపై దాడి చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.

Untitled Document
Advertisements