సినిమా సమస్యలపై కీలక నిర్ణయాలు.. : తలసాని

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 12:51 PM

సినిమా సమస్యలపై కీలక నిర్ణయాలు.. : తలసాని

హైదరాబాద్, ఏప్రిల్ 22 : "మా" అసోసియేషన్ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. చర్చలలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత౦ సినీ రంగంలో తలెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం.. తెలంగాణ ప్రభుత్వం సమస్యల పరిష్కార౦పై దృష్టి సారించనుంది. ఈ సమావేశంలో భాగంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిణామాలపై చర్చించాం. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని సినీ పెద్దలు మాటిచ్చారు.

చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, సమన్వయకర్తలు లేకుండా చూస్తామని.. ఫిర్యాదుల కోసం ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. చట్టపరంగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు. నటీనటులకు ఇచ్చే పారితోషికం మధ్యవర్తులకు కాకుండా నేరుగా ఆర్టిస్టులకే ఇవ్వాల్సిందిగా సూచించా౦. ఇప్పటికైనా ఈ వివాదాన్ని ఇంతటితో ఆపాలని మీడియాను కోరుతున్నా" అంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 'మా' అసోసియేషన్ సభ్యులతో పాటు 24 క్రాఫ్ట్స్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, పోలీసు అధికారులు హాజరయ్యారు.





Untitled Document
Advertisements