'ప్రత్యేక హోదా' కు మేము సైతం..

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 01:04 PM

'ప్రత్యేక హోదా' కు మేము సైతం..

హైదరాబాద్, ఏప్రిల్ 22 : ఆంధ్రప్రదేశ్ కు "ప్రత్యేక హోదా" విషయంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు "మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)" సభ్యులు. తెలుగు వారికి ఎలాంటి సమస్య ఎదురైనా తెలుగు సినీ పరిశ్రమ స్పందిస్తోంది అంటూ 'మా' ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.

ఈ సందర్భంగా.. "రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలుగు సినీ పరిశ్రమ సహాయానికి ముందుంటుంది. అందుకోసం "మా" ఎప్పుడు మేము సైతం అంటూ ముందుకొస్తునే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రజలకు ఒక విపత్తు రానుంది. విభజనతో వేరైనా ఆంధ్ర 'ప్రత్యేక హోదా' కై పోరాడుతోంది. ఈ ఉద్యమం కోసం మేము కూడా భాగాస్వాములమవుతాం" అంటూ వెల్లడించారు.





Untitled Document
Advertisements