‘సైరా’ సరికొత్త రికార్డ్..

     Written by : smtv Desk | Thu, Aug 23, 2018, 04:59 PM

‘సైరా’ సరికొత్త రికార్డ్..

సైరా టీజ‌ర్ విడుద‌లై అప్పుడే రోజు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఈ టీజ‌ర్ యూ ట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది. రికార్డుల ప‌రంగానూ మెగాస్టార్ తానెప్పుడూ ముందే ఉంటాన‌ని మ‌రోసారి ఈ టీజ‌ర్ తో నిరూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక్క‌రోజు త‌ర్వాత లెక్క‌లేస్తే సైరా టీజ‌ర్ కోటి 20 ల‌క్ష‌లు డిజిట‌ల్ వ్యూస్ అని తేలింది. సోష‌ల్ మీడియాలో సైరా సంచ‌ల‌నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఒక్క‌రోజులోనే కోటి 20 ల‌క్ష‌ల వ్యూస్ సాధించి ఔరా సైరా అనిపించాడు చిరంజీవి.

ముఖ్యంగా ఈ టీజ‌ర్ లోని సౌండ్ ఎఫెక్ట్స్ అంద‌రినీ అల‌రిస్తున్నాయి. ఒక్క సౌండ్ ఎఫెక్ట్స్ కోస‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ టీజ‌ర్ చూస్తున్న వాళ్లు కూడా లేప‌కోలేరు. ఇప్ప‌టికీ యూట్యూబ్ వ్యూస్ గంట‌గంట‌కు పెరుగుతూనే ఉన్నాయి. ఈ టీజ‌ర్ తో సిన‌మాపై కూడ అంచ‌నాలు పెరిగిపోయాయి. విడుద‌ల‌కు 8 నెల‌ల ముందే టీజ‌ర్ విడుద‌ల చేసి ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ ధైర్యం ఏంటో చూపించారు. అప్ప‌టివ‌ర‌కు ఇదే అంచ‌నాలు కొన‌సాగుతాయా లేదా అనేది ప‌క్క‌న‌బెట్టి ముందు టీజ‌ర్ అయితే విడుద‌ల చేసారు. దాన్ని కూడా బాహుబ‌లి రేంజ్ లో చిత్రీక‌రించాడు సురేంద‌ర్ రెడ్డి. మొత్తానికి ఇప్పుడు సైరా ఈజ్ ట్రెండింగ్ ఇన్ టాలీవుడ్ అన్న‌మాట‌.





Untitled Document
Advertisements