బ్రేక్ ఫాస్ట్ మానేస్తే డేంజర్ ?

     Written by : smtv Desk | Sat, Feb 23, 2019, 12:27 PM

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే డేంజర్ ?

మీ శరీర బరువు తగ్గాలనకునేవారు.. ఆఫీసుకి లేటు అవుతుందని కొందరు.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తుంటారు. ఆ.. ఏముందిలే రెండు, మూడు గంటలు ఆగితే మధ్యాహ్నం ఒకేసారి లంచ్ చేయవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఇది అస్సలు మంచి పద్దతి కాదని హితోపదేశిస్తున్నారు నిపుణులు.

అయితే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తోనే రోజంతా ఉత్సాహంగా ఉండగలమని చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత.. దాదాపు 12గంటలపాటు ఎలాంటి భోజనం లేకుండా పస్తులుంటాం. ఉదయం నుంచి మొదడు, కండరాలు చురుగ్గా పని చేయాలంటే అత్యవసరంగా కెలోరీలు కావాలి. పిండి పదార్థాలు కూడా అవసరమే. వీటన్నింటికీ బ్రేక్ ఫాస్ట్ ఉపయోగపడుతుంది.

మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పీచు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండేలా అల్పాహారాన్ని తయారు చేసుకోవాలి. పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ బరువును అదుపులో ఉంచడంతోపాటు రోజంతా చలాకీగా ఉండేలా చేస్తుంది.

ఉదయం పూట సరైన ఆహారం తీసుకోకపోతే.. పనిలో ఏకాగ్రత ఉండదు. చిరాకుగా.. పని చేయాలని అనిపించదు. నీరసం కూడా దీనికి జత కడుతుంది. మెదడు కూడా చురుకుగా పనిచేయదు. అందుకే... ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు మరవకూడదంటున్నారు నిపుణులు.

Untitled Document
Advertisements