ఆ రీమేక్‌లో నివేదా!

     Written by : smtv Desk | Mon, Dec 16, 2019, 12:01 AM

ఆ రీమేక్‌లో నివేదా!

బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కిన పింక్ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించనున్నారు. ‘పింక్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోషించనున్నట్లు నిర్మాత బోనీ కపూర్‌ తెలిపారు. అయితే ఈ రీమేక్‌లో మరో కీలకపాత్రలో నివేదా థామస్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పింక్‌’ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారంటూ టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం నివేదాను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Untitled Document
Advertisements