పెట్రోల్ ధర తగ్గుదలకు బ్రేక్...!

     Written by : smtv Desk | Wed, Dec 18, 2019, 01:10 PM

పెట్రోల్ ధర తగ్గుదలకు బ్రేక్...!

ఇంధన ధరలు నిలకడగా కొనసాగాయి. హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.79.42 వద్ద, డీజిల్ ధర రూ.72.07 వద్ద స్థిరంగా కొనసాగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.78.98 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.71.36 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.78.61 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.71.02 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.63 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.66.04 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.80.29 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.27 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.02 శాతం తగ్గుదలతో 65.86 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.56 శాతం తగ్గుదలతో 60.54 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు.





Untitled Document
Advertisements