ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...210 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 04:12 PM

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...210 ప్రభుత్వ ఉద్యోగాల  భర్తీకి నోటిఫికేషన్

1. APCPDCL - 86 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-1 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా APCPDCL మొత్తం 86 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-1 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలులో ఖాళీలున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. మే 3 తో ముగియనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://apcpdcl.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ నుంచి అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులున్న యెడల వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. 2021 మే 10 వతేదీ నుంచి నుంచి మే 14తేదీ లోపున దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకోవచ్చు.

ఇక హాల్‌టికెట్స్ మే 18వ తేదీ 2021 నుంచి మే 22 వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ను మే 23 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు. మే 23 ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 31న ప్రకటించనున్నారు.

మొత్తం ఖాళీలు: 86
విజయవాడ- 38
గుంటూరు- 13
సీఆర్‌డీఏ- 3
ఒంగోలు- 32

ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత, ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్, రీవైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ పాసై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మీటర్ రీడింగ్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ.15,000.
వయస్సు: 2021 జనవరి 31 నాటికి 18 నుంచి 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సులో 5 ఏళ్లు సడలింపునిచ్చారు.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350.
వెబ్‌సైట్‌:https://apcpdcl.in/

2. వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో 07 జాబ్స్
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 7 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్‌ 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://irrigationap.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 07

హైడ్రాలజిస్ట్‌– 01
కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌– 03
అకౌంటెంట్‌– 01
డేటా ఎంట్రీ ఆపరేటర్‌– 02

పోస్టులు–అర్హతలు:
హైడ్రాలజిస్ట్‌:
అర్హత: బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్‌(వాటర్‌ రిసోర్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌:
అర్హత: కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్‌ అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,500 చెల్లిస్తారు.
పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌.

అకౌంటెంట్‌:
అర్హత: ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

డేటాఎంట్రీ ఆపరేటర్‌:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: చీఫ్‌ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: cehydrology@ap.gov.in
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://irrigationap.cgg.gov.in/


3. ఏకలవ్య స్కూళ్లలో 117 టీచర్‌ పోస్టులు
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను

https://tribal.nic.in/ లేదా https://recruitment.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 117
ప్రిన్సిపాల్- 14
వైస్ ప్రిన్సిపాల్- 6
టీజీటీ- 97

ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 1, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2021
పరీక్ష తేదీ: జూన్ మొదటి వారం
వెబ్‌సైట్‌:https://tribal.nic.in/ లేదా https://recruitment.nta.nic.in/





Untitled Document
Advertisements