నిర్మల్: ఊరు మొత్తాన్ని కబ్జా చేసిన వ్యాపారి

     Written by : smtv Desk | Sun, Apr 18, 2021, 12:17 PM

నిర్మల్: ఊరు మొత్తాన్ని కబ్జా చేసిన వ్యాపారి

ఎక్కడైనా స్థలాన్నో, పొలాన్నో కబ్జా చేయడమో, ఇళ్లు, కంపెనీలో బలవంతంగా రాయించుకోవడమో చూసి ఉంటారు. కానీ తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా గ్రామాన్నే కబ్జా చేసేశాడు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో వేణునగర్‌‌కు చెందిన ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. 2000 సంవత్సరంలో ఆ ఊరి నుంచి పెంబి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే మందపల్లికి చెందిన దేవనడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్న అనే వ్యక్తులు సర్వే నం.55/2లో 4.32 ఎకరాల అసైన్డ్‌ (వ్యవసాయ) భూమిని రూ.60 వేలకు కొనుగోలు చేశారు.

అనంతరం వేసుకుని వ్యవసాయం చేసుకుంటూఅక్కడే గుడిసెలు వేసుకుని జీవించసాగారు. ఈ భూమిపై కన్నేసిన పెంబికి చెందిన ఓ వ్యాపారి 2002లో తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే ఈ విషయం భూమిని అమ్మిన వారికి గాని, కొనుగోలు చేసిన వారికి గాని తెలియదు. ఆదివాసీలకు భూమి అమ్మిన విషయమై సాక్షి సంతకాలు కావాలని చెప్పి.. దేవ నడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్నల సంతకాలు తీసుకున్న ఆ వ్యాపారి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ భూమి కోటి రూపాయల వరకు పలుకుతున్న ఆ భూమి ‘ధరణి’లో వ్యాపారి భార్య పేరిట అసైన్డ్ భూమిగా నమోదైంది. దీనిపై మూడేళ్ల నుంచి ఈ భూమిపై అతడు రైతుబంధు సాయం కూడా పొందుతుండటం గమనార్హం. గ్రామపంచాయతీగా మారిన వేణునగర్‌లో ప్రస్తుతం 50కి పైగా ఆదివాసీ కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇటీవల అక్కడికి వచ్చిన వ్యాపారి వచ్చి ఆ భూమి తనదని, అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాడని చెప్పడంతో 19ఏళ్ల తర్వాత అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.





Untitled Document
Advertisements