గంగానది పవిత్రత

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:05 PM

గంగానది పవిత్రత

మన హైందవ సంస్కృతిలో పుణ్యనదులకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరంలేదు. గంగా, యమునా, కావేరి, నర్మదా, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్య నదులు మన భారతావనిని సస్యశ్యామలంగా మారుస్తున్నాయి. ఈ పుణ్య నదుల్లో ఒక్కటైన గంగా నది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మముల వద్ద జన్మించింది, భగీరధుని వల్ల భూలోకానికి వచ్చింది. మనల్ని తరింపజేసింది. గంగాదేవి విష్ణుపుత్రి, ఈశ్వరపత్ని. గంగకు మరో పేరు సురనది. గంగ ముడులోకాల్లోనూ అనగా దేవలోకమూ, మానవలోకమూ, పాతాలలోకములోనూ ప్రవహిస్తుంది. గంగాజలం దివ్య ఔషధుల సమ్మెళన భరితం. గంగవల్లే కాశీకి అంత దివ్యశక్తి వచ్చిందని ప్రతితీ. సజీవనది గంగానది.

Untitled Document
Advertisements