గంగా నదిలో చెక్కపెట్టెలో పసికందు... వైరల్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:30 PM

 గంగా నదిలో  చెక్కపెట్టెలో పసికందు... వైరల్

మహాభారతంలో కర్ణుడి జననం, అతిరథుడికి ఎలా దొరికాడన్నది అందరికీ తెలిసిన విషయమే. కన్యగా ఉన్న కుంతి సూర్యభగవానుడి అంశతో జన్మించిన కర్ణుడిని ఓ చెక్కపెట్టెలో ఉంచి గంగానదిలో వదిలివేస్తుంది. ఇప్పుడదే రీతిలో ఓ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో జరిగింది. ఇక్కడి గంగా నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకురాగా, ఓ జాలరి దాన్ని గుర్తించాడు. ఆ పెట్టె తెరిచి చూడగా, సజీవంగా వున్న పాప కనిపించింది. ఆ పెట్టెలో దుర్గామాత బొమ్మలు, ఆ పాప జాతకచక్రం కూడా ఉన్నాయి. కాగా, ఆ పాప పేరు గంగ అని జాతకచక్రంలో చూసి తెలుసుకున్నారు.

జాలరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ పసికందును ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మూడు వారాల వయసున్న ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. ఇప్పుడా చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని తాంత్రిక క్రియల్లో భాగంగానే ఇలా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు పరిశోధిస్తున్నారు.

Untitled Document
Advertisements