వాహనదారులకు తీపికబురు...కేంద్రం కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 01:19 PM

మోదీ సర్కార్ తాజాగా వాహనదారులకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ DL, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC వంటి పలు డాక్యుమెంట్లకు సంబంధించిన వాలిడిటీని పొడిగించింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు రకాల వాహన డాక్యుమెంట్ల వాలిడిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు ఈ గడువును మళ్లీ సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వాహనదారులకు ఊరట కలుగనుంది.


కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. కోవిడ్ 10 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వెహికల్‌కు చెందిన ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని వివరించింది.

Untitled Document
Advertisements