కలిసిపోయిన వన్‌ప్లస్, ఒప్పో!

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 04:39 PM

కలిసిపోయిన వన్‌ప్లస్, ఒప్పో!

వన్‌ప్లస్ ఇప్పుడు అధికారికంగా ఒప్పోతో విలీనం అవుతోంది. ఒప్పోతో భాగస్వామ్యం ద్వారా తమకు మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులకు వేగంగా మరింత స్థిరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడానికి అవకాశం లభిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వన్‌ప్లస్, ఒప్పో రెండూ తమ ఉత్పత్తి వ్యూహాన్ని పర్యవేక్షించడానికి ఒక సంవత్సరం నుంచి కలిసి పనిచేస్తున్నాయి. ఇవి రెండూ బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన బ్రాండ్లే.

అయితే వన్‌ప్లస్ స్వతంత్రంగా పనిచేయడం కొనసాగిస్తుందని పీట్ లా ఆ పోస్టులో తెలిపారు. వన్‌ప్లస్ ఉత్పత్తులను లాంచ్ చేయడం, ఈవెంట్‌లను నిర్వహించడం, మునుపటిలాగే అదే వన్‌ప్లస్ ఛానెల్‌ల ద్వారా ఫీడ్‌బ్యాక్ కోసం మీతో (వన్‌ప్లస్ కమ్యూనిటీ) నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం వంటివి ఉంటాయన్నారు. వన్‌ప్లస్ కొత్త కస్టమర్‌లను కూడా సంపాదించాలని ఈ భాగస్వామ్యం ద్వారా ఆశిస్తుంది.

అయితే ఈ విలీనం అంత ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. కార్ల్ పీ ఆశ్చర్యకరంగా నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తరువాత పీట్ లా ఒప్పోతో చేరినప్పుడు ఎన్నో విషయాల్లో స్పష్టత రావడం మొదలైంది. వన్‌ప్లస్ చైనాలో ఒప్పో కలర్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వన్‌ప్లస్ 9 సిరీస్‌ను లాంచ్ చేసింది. దీనికి ముందు చైనాలోని అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లు హైడ్రోజన్‌ఓఎస్‌పై పని చేసేవి.

వన్‌ప్లస్‌లో ఒకానొక సమయంలో హైడ్రోజన్‌ఓఎస్, ఆక్సిజన్‌ఓఎస్‌లపై వేర్వేరు బృందాలతో పనిచేసింది. వన్‌ప్లస్ ప్రారంభ దశలో వీటి నిర్వహణ కూడా చాలా కష్టం అయింది. వన్‌ప్లస్ ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా పాటించింది. కాలక్రమేణా, వన్‌ప్లస్ మరిన్ని ఫోన్‌లను లాంచ్ చేసింది. ఆ తర్వాత వన్‌ప్లస్ మరిన్ని మార్కెట్లకు విస్తరించడంతో ఈ వివరాలు మరుగునపడిపోయాయి.

అయితే ఇప్పటికీ వన్‌ప్లస్ తన ఫోన్లను ఆక్సిజన్ఓఎస్‌తోనే లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అది కాస్త ఉపశమనాన్ని కలిగించే విషయం. ఒప్పో, వన్‌ప్లస్ భాగస్వామ్యం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులను మరింత ఆకట్టుకుంటామని, తాము కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తామని పీట్ లా తెలిపారు.

Untitled Document
Advertisements