పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు పై క్లారిటీ

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 07:02 PM

పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు పై క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే పరీక్షల తేదీల విషయంలో సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదు అంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అయితే సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పై ఉన్నతాధికారుల తో సమీక్ష సమావేశం జరిగింది. అయితే సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షలకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చారు. పరీక్షల పై మొదటి నుండి తమ వైఖరి ఒకటే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతి పక్ష నేతలు మరొక పక్క డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements