వైసీపీ పై దేవినేని ఫైర్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 07:04 PM

వైసీపీ పై దేవినేని ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొక సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా. గత 66 ఏళ్ళలో కార్పొరేషన్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షూరిటీ విలువ 60 వేల కోట్ల రూపాయలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ష్యూరిటీ 60 వేల కోట్ల రూపాయలే కాకుండా, బడ్జెట్లో చూపకుండా, బయటికి చెప్పకుండా మరో 21,500 కోట్ల రూపాయలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గ్యారెంటీ అంటూ సోషల్ మీడియా ద్వారా దేవినేని ఉమా వెల్లడించారు. అయితే ఇది ఆల్ టైమ్ రికార్డు అంటూ చెప్పుకొచ్చారు. ఔనా కాదా చెప్పండి జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయం కాగా వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Untitled Document
Advertisements