మీరు ఇక్కడికి వచ్చి ఉద్దరించేది ఏమి లేదు.

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 07:12 PM

మీరు ఇక్కడికి వచ్చి ఉద్దరించేది ఏమి లేదు.

వైఎస్ షర్మిలపై హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేరేడుచెర్ల మండలం మేడారంలో ఓ నిరుద్యోగి కనపడకుండా పోతే తానే కిడ్నాప్ చేయించానని ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందని సైదిరెడ్డి అన్నారు. షర్మిలమ్మ మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేర‌ని విమర్శించారు. ఆత్మగౌరవం అనే నినాదంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.


అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఆంధ్రాకు సంబంధించిన మీరు ఇక్కడికి వచ్చి ఉద్దరించేది ఏమి లేదని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు నియమాలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి 4 టీఎంసీల నీరు దౌర్జన్యంగా ఆంధ్రాకు తరలించడంపై దీనికి షర్మిల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Untitled Document
Advertisements