ఢిల్లీ కి ప్రత్యేక విమానం లో వెళ్ళారు అంటే అర్ధం చేస్కోండి

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 07:14 PM

 ఢిల్లీ కి ప్రత్యేక విమానం లో వెళ్ళారు అంటే అర్ధం చేస్కోండి

తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరిన ఈటెల రాజేందర్ పై తెరాస నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు. ఏ ఎమ్మెల్యే అడిగినా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు అని, కానీ మొన్నటి వరకూ హుజురాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ మాత్రం నిధులు అడగలేదు అని అన్నారు. అయితే ఆరుసార్లు గెలిపించినా, ఎక్కడా కూడా అభివృద్ది జాడ కనిపించలేదు అని వ్యాఖ్యానించారు. అయితే మంత్రిగా తన భూములు క్రమబద్ధీకరించాలి అని సీఎం కేసీఆర్ ను కలిశారే తప్ప, హుజురాబాద్ అభివృద్ధికి ఏనాడూ ఈటెల రాజేందర్ కృషి చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


అయితే ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజక వర్గ ప్రజల ఆత్మ గౌరవం ను ఢిల్లీ లో తాకట్టు పెట్టారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ లో చేరడానికి ఢిల్లీ కి ప్రత్యేక విమానం లో వెళ్ళారు అంటే ఆయన వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం లో గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీని పై ఈటెల రాజేందర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Untitled Document
Advertisements