బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్...అలా చేయొద్దంటూ హెచ్చరిక

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 08:25 PM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్...అలా చేయొద్దంటూ హెచ్చరిక

మీకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చని తెలియజేస్తోంది.

ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ మేరకు కస్టమర్లకు హెచ్చరిస్తోంది. కేవైసీ మోసాలు పెరిగిపోతున్నాయని, అందువల్ల కస్టమర్లు అలర్ట్‌గా ఉండాలని కోరుతోంది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు కస్టమర్లను మోసం చేస్తున్నారని తెలియజేసింది.


బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినట్లుగానే మోసగాళ్లు కూడా కస్టమర్లు ఎస్ఎంఎస్‌లు పంపి, మోసం చేస్తున్నారని ఎస్‌బీఐ తెలిపింది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ కోరుతోంది. అంతేకాకుండా బ్యాంక్ తన ఖాతాదారులకు పలు సూచనలు కూడా చేసింది.

ఎస్ఎంఎస్‌ లేదా ఈమెయిల్స్‌లో వచ్చే మోసపూరిత లింక్స్‌పై క్లిక్ చేయవద్దని బ్యాంక్ తెలిపింది. అలాగే బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ కోసం ఎలాంటి లింక్స్ పంపదని పేర్కొంది. ఇంకా మొబైల్ నెంబర్ సహా ఇతర వివరాలను ఎవ్వరికీ షేర్ చేయవద్దని తెలియజేసింది. ఒకవేళ ఎవరైనా మోసగాళ్లు కాల్ చేస్తే 18004253800, 1800112211 నెంబర్లకు తెలియజేయాలని సూచించింది.

Untitled Document
Advertisements