భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు....తొలి ఇన్నింగ్స్‌ని 396 పరుగుల వద్ద డిక్లేర్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 09:08 PM

భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు....తొలి ఇన్నింగ్స్‌ని 396 పరుగుల వద్ద డిక్లేర్

భారత మహిళల జట్టుతో బ్రిస్టోల్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 269/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్‌లో సోఫియా (74 నాటౌట్: 127 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆమెతో పాటు చివర్లో అన్యా (47: 33 బంతుల్లో 6x4, 1x6) దూకుడుగా ఆడేసింది. దాంతో.. 121.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. 396/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌‌ని రెండో సెషన్‌లో డిక్లేర్ చేసింది.

ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 12తో ఈరోజు ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సోఫాలి చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలిచింది. అయితే.. మరో ఎండ్‌లోని కేథరైన్ బ్రౌంట్ (8: 37 బంతుల్లో) నిన్నటి స్కోరుకి ఒక పరుగు మాత్రమే జోడించి జులన్ గోస్వామి ఓవర్‌లో ఔటైపోయింది. అనంతరం వచ్చిన ఎక్లీ‌టోన్ (17: 56 బంతుల్లో 1x4) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమ్ స్కోరు 326 వద్ద ఔటైంది. అయితే.. చివర్లో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడేసిన అన్యా ఎడాపెడా బౌండరీలు బాదేయగా.. సోఫియా చక్కటి సహకారం అందించింది. అయితే.. టీమ్ స్కోరు 396 వద్ద అన్యా ఔటవగానే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ని కెప్టెన్ హీథర్ నైట్ డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో స్నేహా రాణా 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ మూడు, జులన్ గోస్వామి, పూజా చెరో వికెట్ తీశారు. ఫాస్ట్ బౌలర్ శిఖ ఫాండే 15 ఓవర్లు వేసినప్పటికీ.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. టీమ్‌లో అత్యధిక ఎకానమీ(4.10)తో బౌలింగ్ చేసిన బౌలర్ కూడా శిఖ పాండేని కావడం గమనార్హం.

Untitled Document
Advertisements