టీమిండియాకి సపోర్ట్ చేయనున్న భారత ఆర్మీ....వీడియో వైరల్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 09:09 PM

టీమిండియాకి సపోర్ట్ చేయనున్న భారత ఆర్మీ....వీడియో వైరల్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో.. టీమిండియాని స్టేడియంలో ఉత్సాహపరిచేందుకు భారత ఆర్మీ సిద్ధమైపోయింది. సౌథాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. స్టేడియంలోకి సుమారు 4,000 మందిని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతించబోతోంది. దాంతో.. స్టేడియంలో తాము భారత జట్టుని ఉత్సాహపరుస్తామని భారత ఆర్మీ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఈ నెల 3న సౌథాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేయగా.. శుభమన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్‌‌తో ఇటీవల రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించుకుని మరో మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకుంది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై కివీస్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలింగించే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్ పేసర్లకి అనుకూలమని వార్తలు వస్తుండటంతో.. ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో టీమిండియా బరిలోకి దిగనుందని వార్తలు వస్తున్నాయి.Untitled Document
Advertisements