హైదరాబాద్‌పై ఉన్న ప్రేమని మరోసారి చాటిన డేవిడ్ వార్నర్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 09:13 PM

హైదరాబాద్‌పై ఉన్న ప్రేమని మరోసారి చాటిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి హైదరాబాద్‌పై తన ప్రేమని చాటాడు. సుదీర్ఘకాలంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఆడుతున్న డేవిడ్ వార్నర్.. తెలుగుపై పట్టు సాధించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్‌లో సినిమాల్లోని పాటలకి డ్యాన్స్ చేస్తూ.. డైలాగ్‌లను కూడా పలుకుతున్న వార్నర్.. తాజాగా భారతదేశం తనకి రెండో ఇల్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. అన్నింటికంటే తనకి నచ్చే ప్రదేశం హైదరాబాద్ అని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని చాటుతూ కొన్ని ఫొటోల్ని కూడా వార్నర్ షేర్ చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కి ఊహించని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సీజన్ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్‌లు ముగియగా.. హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లాడింది. కానీ.. వార్నర్ మాత్రం ఆరు మ్యాచ్‌‌లే ఆడి 193 పరుగులు చేశాడు. సీజన్ వాయిదాకి ముందు వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ కేన్ విలియమ్సన్‌కి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌పై వేటు పడింది. దాంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవగా.. హైదరాబాద్‌కి వార్నర్ ఆడటం ఇదే చివరి సీజన్ అని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి బీసీసీఐ నిర్వహించబోతోంది. సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆడేందుకు వెస్టిండీస్, బంగ్లాదేశ్ టూర్‌ల నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. ఈ సిరీస్‌లకి తన పేరుని సెలక్షన్‌ కోసం పరిశీలించొద్దని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కి వార్నర్ సూచించినట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements