సంవత్సరానికి 300 రోజులు నిద్రలోనే!!

     Written by : smtv Desk | Wed, Jul 14, 2021, 01:02 PM

సంవత్సరానికి 300 రోజులు నిద్రలోనే!!

రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అతను సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతూనే గడిపేస్తాడట. అతడికి అతినిద్ర 23ఏళ్ల క్రితం మొదలైందట. మొదట్లో రోజుకు 18 గంటలు పడుకుని లేచే పూర్ఖారామ్.. ఆ తర్వాత 5-7 రోజులకోసారి నిద్రలేచేవాడట. ఇప్పుడు ఏకంగా నెలలో 20-25 రోజులు నిద్రపోతేనే ఉంటున్నాడట. ఎప్పుడైనా నిద్ర మేల్కోని ఏదైనా పని చేయాలంటే అతడి శరీరం సహకరించదు. ఇలా సంవత్సరానికి సగటున 300 రోజుల నిద్రలోనే గడుపుతున్నట్లు పూర్ఖారామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అతడి భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా సమస్య ఏంటో నిర్ధారించలేకపోతున్నారని తెలిపింది. కొంతమంది ఈ వ్యాధిని హైపర్సోమ్నియాగా తేల్చినా సరైన చికిత్స చేయలేకపోతున్నారని వెల్లడించింది.

Untitled Document
Advertisements