బంకుల్లో జరిగే ఈ మోసాలా గురించి తెలుసా?

     Written by : smtv Desk | Tue, Jul 20, 2021, 11:55 AM

బంకుల్లో జరిగే ఈ మోసాలా గురించి తెలుసా?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ సెంచరీ కొట్టేస్తే.. డీజిల్ కూడా అదే దారిలో పయనిస్తోంది. పెట్రోల్ రేటు రూ.110కు దగ్గరిలో ఉంది. ఇక డీజిల్ రేటు రూ.100కు సమీపంలో కదలాడుతోంది. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

కారు, స్కూటర్, బైక్ వంటి వాటికి పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మోసపోకుండా ఉండొచ్చు. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. పెట్రోల్ బంకుల్లో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించేటప్పుడు పెట్రోల్ మిషన్‌లో రీడింగ్ చూసుకోవాలి. రీడింగ్ జీరో వద్ద ఉండాలి. అప్పుడే వెహికల్ ఫ్యూయెల్ కొట్టించుకోవాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కస్టమర్లకు పెట్రోల్ బంకుల్లో ప్యూరిటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు.

అంటే పెట్రోల్, డీజిల్ క్వాలిటీ తెలుసుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు పెట్రోల్ నాణ్యత మీద అనుమానం ఉంటే.. పేపర్ టెస్ట్ చేయొచ్చు. పెట్రోల్ పేపర్ మీద రెండు మూడు చుక్కలు వేస్తే.. అది వెంటనే ఆవిరి అవుతుంది. పేపర్ మీద ఎలాంటి మరక ఉండదు. ఒకవేళ మరకలు ఉంటే.. అప్పుడు ఆ పెట్రోల్ క్వాలిటీ సరిగా లేదని అర్థం చేసుకోవాలి.

ఇంకో రకం మోసం కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. పెట్రోల్ పట్టే వారు కూడా మోసం చేస్తుంటారు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టమని చెబుతారు. కానీ వాళ్లు రూ.100 లేదా రూ.200 కొట్టి ఆపేస్తారు. మీరు ఫుల్ ట్యాంక్ అని చెబుతారు. అప్పుడు ఆయన ముందు కొట్టిన రీడింగ్‌‌కు సెపరేట్‌గా డబ్బులు తీసుకోవచ్చు. మళ్లీ ఫుల్ ట్యాంక్‌కు డబ్బులు కట్టాలి. కానీ రీడింగ్ మాత్రం ఒక్కటే. ఇలా కూడా మోసం చేస్తుంటారు.

ఇంకా కొంత మంది పెట్రోల్‌ లేదా డీజిల్‌ను ఆపి ఆపి కొడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా కస్టమర్లు మోసపోవాల్సి వస్తుంది. పైపులో కొంత ఫ్యూయెల్ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కొత్త మెషీన్లలో అయితే ఈ ప్రాబ్లమ్ ఉండదు.





Untitled Document
Advertisements