రెడ్‌మీ ల్యాప్‌టాప్‌ త్వరలో లాంచ్

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 12:00 PM

రెడ్‌మీ ల్యాప్‌టాప్‌ త్వరలో లాంచ్

రెడ్‌మీ నోట్ 10టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈరోజే లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్ చివరిలో మొట్టమొదటి రెడ్‌మీ ల్యాప్‌టాప్‌ను కంపెనీ టీజ్ చేసింది. దీనికి రెడ్‌మీ బుక్ అని పేరు పెట్టారు. ఈ ల్యాప్‌టాప్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మనదేశంలో లాంచ్ అయ్యే మొదటి రెడ్‌మీ ల్యాప్‌టాప్ ఇదే కానుంది. రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా.. పవర్ బ్యాంకులు, ఇయర్‌బడ్స్, ఫిట్‌నెస్ ట్రాకర్లను కూడా మనదేశంలో లాంచ్ చేయనుంది. ఇటీవలే మొట్టమొదటి రెడ్‌మీ టీవీ కూడా మనదేశంలో కూడా లాంచ్ అయింది. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. అయితే ఇవి సరిగ్గా ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు. కంపెనీ దీన్ని టీజ్ చేసింది కాబట్టి.. త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి లాంచ్ అయితే ఈ రెడ్‌మీ బుక్ ల్యాప్‌టాప్.. రియల్‌మీ లాంచ్ చేయబోయే ల్యాప్‌టాప్‌తో పోటీ పడే అవకాశం ఉంది.

ఎంఐ నోట్‌బుక్ ప్రో 14, ఎంఐ నోట్‌బుక్ 15 అల్ట్రా ల్యాప్‌టాప్‌లు మనదేశంలో లాంచ్ అవుతాయని గతనెలలో వార్తలు వచ్చాయి. ఇవే చైనాలో రెడ్‌మీ బుక్ ప్రో 14, రెడ్‌మీ బుక్ ప్రో 15 పేర్లతో లాంచ్ అయ్యాయి. ఇవి మనదేశంలో ఇంటెల్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో లాంచ్ అవుతాయని వార్తలు వస్తున్నాయి. రెడ్‌మీ బుక్ ప్రో 15లో 15.6 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పిక్సెల్ రిజల్యూషన్ 3,200x2,000గా ఉండగా, యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఇంటెల్ ఐ7 11వ తరం వరకు ప్రాసెసర్‌లను ఇందులో అందించారు. 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

రెడ్‌మీ బుక్ ప్రో 14లో 14 అంగుళాల 2.5కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.2 శాతంగా ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నారు. 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, రెండు యూఎస్‌బీ టైప్‌-ఏ పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. ఇందులో 56Whr బ్యాటరీ ఉండనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.72 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది.





Untitled Document
Advertisements