కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 11:17 AM

కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్లో రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాత రికార్దులను తిరగరాస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి వివాదాలు కూడా నెలకొన్నాయి. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్ ముస్లిం టోపీని ధరించినట్టున్న సన్నివేశంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై భీమ్ వారసులతో పాటు, చరిత్రకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొమరం భీమ్ ఎప్పుడూ ముస్లిం టోపీని ధరించలేదని వారు అంటున్నారు. ఈ అంశంపై రాజమౌళి తండ్రి, ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, కొమరం భీమ్ టోపీ పెట్టుకోవడానికి గల కారణాన్ని వివరించారు.

భీమ్ ను పట్టుకోవడానికి నిజాం ప్రభువులు యత్నించారని, ఆయనను వెంటాడారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం యువకుడిగా మారాడని, ముస్లిం టోపీ ధరించాడని చెప్పారు. సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ను పోలీసు పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందని... సిల్వర్ స్క్రీన్ పై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే 'ఆర్ఆర్ఆర్' కథను తయారు చేశామని చెప్పారు.





Untitled Document
Advertisements