‘105 మినిట్స్‌’...సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 11:41 AM

‘105 మినిట్స్‌’...సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర

హీరోయిన్ హన్సిక తాజా సినిమా ‘105 మినిట్స్‌’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు మొదలైంది. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజు దుస్స దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ఉండడు .. అలా అని చెప్పేసి నాయికను ప్రధానంగా చేసుకుని ఇతర పాత్రల చుట్టూ అల్లిన కథ కాదు. అసలు ఈ కథలో నాయిక తప్ప తెరపై ఎవరూ కనిపించరు. అదే ఈ సినిమా ప్రత్యేకత .. అందుకే ఇది ప్రయోగాత్మక చిత్రాల కేటగిరీలోకి వెళుతుంది.

సింగిల్ షాట్ ఫార్మేట్ లో సినిమా చిత్రీకరణ ఉంటుందట. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎడిటింగ్ కూడా ఉండదని అంటున్నారు. అంటే షూటింగు స్పాట్ లోనే ఎడిటర్ ఉంటూ పర్యవేక్షిస్తూ ఉంటాడు .. అంతేగాని ఆ తరువాత ఎడిటింగ్ చేయడం ఉండదు. ఈ తరహా కాన్సెప్ట్ తో .. చిత్రీకరణతో ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా రాలేదని చెబుతున్నారు. ఈ తరహా సినిమాలో చేయడం తనకి చాలా థ్రిల్లింగ్ గా ఉందని హన్సిక అంటోంది. ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందేమో చూడాలి మరి.





Untitled Document
Advertisements