వరల్డ్‌ రికార్డ్‌ బ్రేక్

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 12:09 PM

వరల్డ్‌ రికార్డ్‌ బ్రేక్

శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు అరుదైన ఘనత సాధించింది. కొలంబో వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ని ఇప్పటికే 2-0తో భారత్ చేజిక్కించుకోగా.. నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం జరగనుంది. మంగళవారం ముగిసిన రెండో వన్డేలో శ్రీలంకని 3 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా నెలకొల్పిన వరల్డ్‌ రికార్డ్‌ని భారత్ బ్రేక్ చేసింది.

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 92 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ టీమ్‌ని ఓడించగా.. మంగళవారం వరకూ ఆస్ట్రేలియా మినహా ఏ జట్టు కూడా ఒకే ప్రత్యర్థిని అన్ని వన్డేల్లో ఓడించలేదు. కానీ.. తాజాగా శ్రీలంకని వరుసగా రెండు వన్డేల్లో ఓడించడం ద్వారా భారత్ జట్టు ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. సిరీస్ ముందు వరకూ 91 వన్డేల్లో లంకేయుల్ని ఓడించిన భారత్.. తాజాగా 93 వన్డేలతో టాప్‌లో నిలిచింది.

రెండో వన్డేలో 276 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7తో నిలిచింది. అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ క్రీజులో లేకపోవడంతో భారత్ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు. కానీ.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7x4, 1x6) అసాధారణ పోరాట పటిమని కనబర్చి మరో 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టుని మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్: 28 బంతుల్లో 2x4) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీపక్ చాహర్- భువీ జోడీ 8వ వికెట్‌కి అజేయంగా 84 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.





Untitled Document
Advertisements