వచ్చే నెల నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీలు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 03:08 PM

వచ్చే నెల నుంచి పెరగనున్న ఏటీఎం చార్జీలు

వచ్చే నెల నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పటికే ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంకులు వచ్చే నెల నుంచి చార్జీలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచే అమలులోకి రానుంది.

ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచారు. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సా్క్షన్లకు ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ఆర్‌బీఐ ప్రకారం చూస్తే.. బ్యాంక్ కస్టమర్లకు నెలకు వారి బ్యాంక్ ఏటీఎం నుంచి ఐదు సార్లు చార్జీలు లేకుండానే ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు.

అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలో కూడా చార్జీలు పడకుండా లావాదేవీలు నిర్వహించొచ్చు. నెలకు 3 నుంచి 5 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. మెట్రో ప్రాంతాల్లోని వారు అయితే 3 లావాదేవాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు 5 లావాదేవీలు చార్జీలు లేకుండా నిర్వహించొచ్చు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం చార్జీలు సవరించింది. ఆగస్ట్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలో పయనించొచ్చు.





Untitled Document
Advertisements