నలకూబరుడు రావణుడిని ఎందుకు శపించాడు?

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 05:42 PM

నలకూబరుడు రావణుడిని ఎందుకు శపించాడు?

నలకూబరుడు ఇతడు వైశ్రావణుడి (కుబేరుని) కుమారుడు. ఈయన సోదరుడు మణిగ్రీవుడు. రావణుడు లంకను పరిపాలిస్తూ పదు నాలుగు లోకాలు గడగడలాడించాడు. అతడలా జైత్రయాత్ర చేస్తూ ఓ రోజు కైలాసం లోని పర్వతంపై విశ్రమించగా గాజుల సవ్వడి విని అతని 20 నేత్రాలు తెరచి ఒక అందాల రాశిని చూసి ఆమె చెయ్యి పట్టుకొన్నాడు. ఆమె "నేను రంభను అని నలకూబరుడు తన భర్త అని అతడు నీ సోదరుడైన కుబేరుని కుమారుడు గనుక నీకు కుమారుడని, నన్ను బలాత్కరించుట అన్యాయమని" ప్రాధేయపడింది. అయినా రావణుడు లెక్క చేయక ఆమెను బలవంతంగా అనుభవించాడు. రంభ బాధతో రావణుడు తనను బలాత్కరించిన విషయం తన భర్త నలకూబరునీతో చెప్పగా అతడు " ఏ స్త్రీని కూడా ఆమె అంగీకారం లేకుండా బలత్కరించినచో తల ఏడూ ముక్కలవుతుంది" అని రావణుడిని శపించాడు.





Untitled Document
Advertisements