మాస్టర్ డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ బంద్

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 07:07 PM

మాస్టర్  డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ బంద్

కొత్తగా మాస్టర్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. కార్డు నెట్‌వర్క్‌లోకి కొత్త కస్టమర్లను పొందకుండా నియంత్రణలు విధించింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు జూలై 22 నుంచి అమలులోకి వచ్చాయి. పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలను మాస్టర్ కార్డు అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణం. మాస్టర్ కార్డ్ కంపెనీకి తగినంత సమయం, అవసరమైన అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్‌ ఆదేశాలకు అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ తెలిపింది. అందుకే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించామని వివరించింది. కాగా ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రస్తుత మాస్టర్ కార్డు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదని గమనించాలి.





Untitled Document
Advertisements