'ఎతరుక్కుమ్ తునింధవన్' సెకండ్ లుక్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 10:59 AM

'ఎతరుక్కుమ్ తునింధవన్' సెకండ్ లుక్

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 'ఎతరుక్కుమ్ తునింధవన్' సినిమాకి పాండిరాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ ను వదిలారు. ఈ సినిమా టీమ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విభిన్నమైన కథనాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకి అక్కడ మంచి పేరు ఉంది. యథార్థ సంఘటనల నుంచి కథలను తీసుకోవడం .. సహజత్వంతో ఆ కథలను తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి పాండిరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా చూసుకుంటే సూర్యకి ఇది 40వ సినిమా. ఇంతవరకూ సూర్య చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. ఈ సినిమాలో సూర్య జోడీగా 'ప్రియాంక అరుళ్ మోహన్' అలరించనుంది. తెలుగులో 'నానీస్ గ్యాంగ్ లీడర్' .. 'శ్రీకారం' చేసిన ప్రియాంక అరుళ్ మోహన్, ఇప్పుడు తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ సినిమాతో అక్కడ ఆమె బిజీ కావడం ఖాయమని అంటున్నారు.





Untitled Document
Advertisements