గేదెను ఇంటర్వ్యూ చేసిన పాక్ జర్నలిస్ట్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:16 PM

గేదెను ఇంటర్వ్యూ చేసిన పాక్ జర్నలిస్ట్

మనుషులను ఇంటర్వ్యూ చేయడం రొటీన్.. జంతువులను, వస్తువులను ఇంటర్వ్యూ చేయడం వెరైటీ అంటున్నారు పాకిస్తాన్ జర్నలిస్టులు. ఔనండి.. అక్కడ అదోరకమైన ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వెంటకారం అనుకోవాలో.. వ్యంగ్య బాణాలు అనుకోవాలో తెలియదుగానీ.. వారు అలాంటి ఇంటర్వ్యూలతో టీవీ చానెళ్లకు కావాల్సిన టీఆర్పీ ర్యాటింగులను బాగానే తెచ్చిపెడుతున్నారు. ముఖ్యంగా అమిన్ హఫీజ్ అనే విలేకరి ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అమిన్ వస్తువులను జంతువులను ఇంటర్వ్యూ చేస్తూ అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అతడు లాహోర్‌లో ఓ గేదెను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి ఎక్కాడు. గేదెలను విక్రయించే ఓ మార్కెట్‌లోకి వెళ్లిన అమిన్ ఓ గేదె వద్ద చిన్న మైకును పుట్టుకుని ప్రశ్నలు అడిగాడు. ‘‘మీరు లహోర్ వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తోందో చెప్పండి’’ అని ఆ గేదెను ప్రశ్నించాడు. ఇందుకు ఆ గేదె తనదైన భాషలో ‘‘అంబా’’ అని అరిచింది. దీంతో అమిన్ కెమేరా వైపు తిరిగి.. ‘‘చూశారా.. గేదెకు లాహోర్ నచ్చిందట’’ అని తెలిపాడు. ఆ తర్వాత ‘‘నీకు లాహోర్‌లో ఆహారం ఎక్కువ నచ్చిందా? లేదా మీ గ్రామంలో ఆహారం రుచిగా ఉంటుందా?’’ అని ప్రశ్నకు కూడా ఆ గెదె ‘‘అంబా’’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అతడు ‘‘గేదెకు లాహోర్‌లో ఆహారం బాగా నచ్చిందట’’ అని తెలిపాడు.ఈ వీడియో క్లిప్‌ను మరో పాకిస్తానీ జర్నలిస్ట్ నైలా ఇనయత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హఫీజ్ 2016లో కూడా పసువులను ఇంటర్వ్యూ చేసి అమిన్ వైరల్ అయ్యాడు. 2018లో గాడిదలకు, మనుషులకు ఉండే స్నేహం గురించి వివరించేందుకు గాడిదపై కూర్చొని సవారి చేశాడు. జియో (Geo) టీవీ ఉర్దు రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమీన్ కొద్ది రోజుల కిందట ఓ చారిత్రాత్మక కట్టడం గురించి చెప్పేందుకు.. ఏకంగా రాజు అవతారం ఎత్తాడు. రాజులా వస్త్రాలు ధరించడంతోపాటు చేతిలో కత్తి పట్టుకుని రిపోర్టింగ్ చేశాడు. దీంతో నెటిజనులు అతడిని జోకులతో ఆడేసుకున్నారు.









Untitled Document
Advertisements